దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా.. స్వచ్ఛమైన పాలన అందిస్తా : రజనీకాంత్

బుధవారం, 17 మే 2017 (17:16 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై సాగుతున్న ఊహాగానాలు మరింతగా చెలరేగాయి. తన అభిమానులతో ఓపిగ్గా ఫోటోలు దిగుతున్నారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆయన అభిమానులు.. తమ అభిమాన హీరో రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ మరోమారు స్పందించారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి, స్వచ్ఛమైన పాలన అందిస్తానని ప్రకటించారు. అయితే, రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు లేదని, ఒకవేళ దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తానన్నారు. 
 
అంతేకాకుండా, తాను చెప్పాల్సింది చెప్పేశానని, ఇంకా చెప్పడానికి ఏమీ లేదని అన్నారు. కాగా, చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఐదు రోజుల పాటు జిల్లాల వారీగా అభిమానులను కలుస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి