Balayya - Harshali Malhotra
నందమూరి బాలకృష్ణ హీరోగా “అఖండ 2” చిత్రంలో బాల నటిగా ముంబైకు చెందిన హర్షాలి మల్హోత్రా నటిస్తోంది. ఈ పాప సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయి జాన్ సినిమాలో నటించింది. ఈ సినిమా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ముందుగా ఈ పాత్ర కోసం నటి లయ కుమార్తె అనుకున్నారు. ఇందుకోసం షూటింగ్ స్పాట్ కు లయ తన కుమార్తెను తీసుకుని వెళ్ళింది. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను కు లయ కుమార్తె శ్లోకా వయస్సు ఎక్కువ కావడంతో సున్నితంగా తిరస్కరించారని తెలిసింది.