మహాభారతంలోని కొన్ని ఎపిసోడ్స్ సినిమా రూపుదిద్దుకోనున్నాయి. ఈ సినిమా కోసం రూ.600 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మహా ప్రాజెక్టు కోసం అక్కినేని నాగార్జున, మలయాళ నటుడు మోహన్‌లాల్ చేతులు కలపనున్నారు. ‘రంధమూలం’ మహాభారత గాథలోని కొన్ని పర్వాలను ఆధారంగా చేసుకుని మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ రచించిన నవల నుంచి ఈ సినిమాను రూపొందించనున్నారు.
కురుపాండవులే ఈ రచనలో ప్రధాన పాత్రధారులు. దీన్ని సినిమా తీసుకొచ్చే దిశగా మోహన్ లాల్ ప్రయత్నాలు చేశారు. మూడేళ్ల కిందటే ఈ ప్రతిపాదన వచ్చినా ఎందుకో పట్టాలెక్కలేదు. తాజాగా లాల్ మాట్లాడుతూ ‘రంధమూలం’ ను సినిమాగా తీసుకొస్తానని వ్యాఖ్యానించాడు. దానికి ఏకంగా ఆరువందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించారు,
భీమసేనుడిగా ఈ చిత్రంలో మోహన్ లాల్ నటిస్తారని తెలుస్తోంది. ఇక భీష్ముడి పాత్రకు అమితాబ్‌ను, అర్జునుడి పాత్రకు విక్రమ్‌ను, ద్రౌపది పాత్రకు ఐశ్వర్యరాయ్‌ను తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాలో నాగార్జున ఒక ముఖ్యపాత్రను చేయబోతున్నాడట. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారని తెలిసింది.