Viraj Reddy Cheelam, Mimi Leonard, Shilpa Balakrishna
విరాజ్ రెడ్డి చీలం హీరోగా జగ పెద్ది దర్శకత్వంలో అను ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనసూయ రెడ్డి నిర్మించిన చిత్రం గార్డ్. రివేంజ్ ఫర్ లవ్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న రిలీజ్ చేయబోతోన్నారు. సినిమా మొత్తాన్ని ఆస్ట్రేలియాలో షూట్ చేయడం విశేషం. హారర్, థ్రిలర్, లవ్ ఎలిమెంట్స్‌తో రాబోతోన్న ఈ చిత్రంలో మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలుగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.