VV Vinayak, Vishwa, Rachaya,
వి.వి.వినాయక్ శిష్యుడు "విశ్వ"ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్.రాచయ్య నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం`గీత`. మ్యూట్ విట్నెస్" అన్నది ఉప శీర్షిక. హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా నటిస్తోంది. "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దర్శకులు వి.వి.వినాయక్ విడుదల చేశారు.