'రాజకీయాలంటే ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే మార్గం. ప్రజలకు సేవ చేయాలనుకుంటే ముందు, వెనకా ఆలోచించకూడదు. కానీ, రజినీ తీరు చూస్తుంటే అలా లేదు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించడానికే ఆయన ఎన్నో సంవత్సరాలు తీసుకున్నారు. అన్ని లెక్కలూ వేసుకుని ప్రవేశించడానికి ఇది వ్యాపారం కాదు. బిజినెస్మేన్లు మాత్రమే పక్కా వ్యూహాలతో వ్యాపారం ప్రారంభిస్తారంటూ వ్యాఖ్యానించారు.
పైగా, మన వ్యాపారం సజావుగా నడుస్తుందా? మన ఉత్సత్తికి మార్కెట్ ఉంటుందా? వంటి అన్ని లెక్కలూ వేసుకుని బరిలోకి దిగుతారు. రజినీ కూడా అలాంటి లెక్కలన్నీ వేసుకుని రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఆయన చేసేది రాజకీయం కాదు.. వ్యాపారం. తాను ఆధ్యాత్మిక రాజకీయాలు నడుపబోతున్నట్టు రజినీ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన చేస్తోంది ఆధ్యాత్మిక వ్యాపారం. ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రజల అభిప్రాయలు తీసుకుంటే మంచిది' అంటూ సత్యరాజ్ విమర్శించారు.