మిథాలీరాజ్‌ను కలిసి చాలా మెళుకువలు, ఆమె ఆహార్యం, క్రికెట్ బేట్ ఎలా పట్టుకుంది అనే విషయాలు తెలుసుకున్నానని తాప్సీ చెప్పింది. సినిమా నటులేకాదు. ఆటగాళ్ళు కూడా తగిన వ్యాయామం, నిద్ర, అలవాట్లు, తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకున్నానని చెబుతోంది. ఇందుకు చాలా కష్టపడ్డాను. ఫిజిక్ తగ్గాను. ఇలాంటి బయోపిక్ చేయడం అదృష్టంగా భావిస్తున్నన్నానని అంటోంది.