`మొదట్లో `హీరో` సినిమా చేయవద్దని అనుకున్నా. పెద్ద సినిమాలలో నటించిన నాకు కొత్త హీరో, చిన్న దర్శకుడుతో చేయాలనిపించలేదు. కానీ పద్మవతిగారు మా సోదిరికి ఒకటికి పదిసార్లు ఫోన్ చేశారు. ఈ పాత్ర నేను చేస్తేనే బాగుంటుందని ఒప్పించారు. అయిష్టంగానే చేశాను. సినిమా చేసేటప్పుడు నా పాత్ర పండుతుందా, లేదా అనే అనుమానం కూడా వుంది. కానీ దర్శకుడు నా అంచనాలను తారుమారు చేసి ప్రేక్షకులు ఎంజయ్ చేసేలా చేశాడు. థియేటర్‌లో స్పందన చూశాక నేను చేసిన హనుమాన్ జంక్షన్ గుర్తుకువచ్చింది. ఇలాంటివి తీయాలంటే దర్శకుడు గొప్పతనం చూపించాలి. హీరో అశోక్‌లో తపన కనిపించింది. ఒకటికి రెండు సార్లు సీన్ బాగా వచ్చేదాకా చేసేవాడు.