నేను బాగానే వున్నా, నో క‌రోనాః అంజ‌లి

గురువారం, 8 ఏప్రియల్ 2021 (17:17 IST)
Anjali post
వ‌కీల్‌సాబ్ లో న‌టించిన నివేద‌కు ఇటీవ‌లే క‌రోనా పాజిటివ్ అని తెలిసిందే. ఆ విష‌యాన్ని ఆమె కూడా ఖ‌రారు చేసింది. ఆ త‌ర్వాత సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆమె ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అందులో న‌టించిన మ‌రో ఇద్ద‌రు అంజ‌లి, అన‌న్య ప్ర‌మోష‌న్‌కు స‌హ‌క‌రించారు. కాగా, తాజాగా అంజ‌లికి కూడా క‌రోనా పాజిటివ్ అని వార్త హ‌ల్‌చ‌ల్ చేసింది. ఈ విష‌యాన్ని ఆమె ఆల‌స్యంగా తెలుసుకున్నాన‌ని అంటూ త‌న సోష‌ల్ మీడియాలో ఆ విష‌యాన్ని ఖండిస్తూ ప్ర‌క‌ట‌న చేసింది.
 
త‌న‌కు క‌రోనా పాజిటివ్ లేద‌నీ, ఈ వార్త తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోయాయ‌ని అంది. త‌న‌కు క‌రోనా వ‌చ్చింద‌ని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు రావ‌డం, సోష‌ల్‌మీడియా, వెబ్‌సైట్ల‌లో చూసి వివిర‌ణ ఇస్తున్నాను. ఆ న్యూస్ అంతా అబ‌ద్ధం. నేను హాపీగానే వున్నాయి. రేపు వ‌కీల్‌సాబ్ విడుద‌ల‌. నేను సేఫ్‌గా వున్నాను. మీరు కూడా సేఫ్‌గా జాగ్ర‌త్త‌గా చ‌ర్య‌లు తీసుకుంటూ సినిమా చూడండి అంటూ పోస్ట్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు