సిద్ద పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటే బావుండు అని ఎప్పుడైనా అనిపించిందా..?” అని రిపోర్టర్ అడిగిన ప్రశాంకు చిరు సమాధానమిస్తూ” చరణ్ ఒప్పుకోకపోతే, కుదరకపోతే వేరే యాక్టర్స్ ఎవ్వరైనా న్యాయం చేస్తారు.. కానీ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది. రియల్ గా ఉన్నటువంటి తండ్రి గుణం యాడ్ అవుతుంది అనే ఉద్దేశ్యంతోటే చరణ్ ను తీసుకోవడం జరిగింది. అయితే ఆ పాత్రకు చరణ్ కూడా దొరకకపోతే.. ది బెస్ట్ ఆల్ట్రనేట్, ఆ ఖాళీని పూరించేది, అదే ఫీల్ నాకిచ్చేది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే.. పవన్ కళ్యాణ్ అదే స్థానంలో ఉంటే నాకు వంద శాతం అదే ఫీల్ ఉంటుంది.. కానీ అంతవరకు ఛాన్స్ తీసుకోలేదు.. అన్ని కుదిరిపోయాయి అలాగా” అని చెప్పారు.