*ఈ క్రమంలో రా రాజా చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి మాట్లాడుతూ..* రా రాజా చిత్రానికి సంబంధించిన టైటిల్, పోస్టర్ చూస్తుంటేనే ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మాములూగా అమ్మాయి హగ్ చేసుకుని, ముద్దు పెడితే హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ పోస్టర్‌లో అమ్మాయి అలా హగ్ చేసుకుంటున్నా కూడా భయమేస్తోంది. పోస్టర్‌లో ఉన్న కలరింగ్, ఫాంట్, ట్యాగ్ లైన్ ఇవన్నీ చూస్తుంటే ఇందులో చాలా చాలా ట్విస్టులు ఉన్నాయని అర్థం అవుతోంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అసలు హీరో హీరోయిన్ల మొహాల్ని కూడా చూపించడం లేదు. ఒక్క మొహాన్ని కూడా చూపించకుండా భయపెట్టడం మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఏ హారర్ దర్శకుడు కూడా మొహం చూపించకుండా సినిమా తీయలేదు. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా చేయడం గ్రేట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.