కత్తి మహేష్‌ను వెనకేసుకొచ్చిన ఓబులేసు.. ఈయనెవరు?

మంగళవారం, 10 జులై 2018 (12:50 IST)
శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌కు కష్టమొచ్చిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కత్తి మహేష్ వంటి వారు సమాజంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని డీజీపీ చెప్పారు. మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు ఏమాత్రం సరికాదని డీజీపీ తెలిపారు. ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా అభిప్రాయాలు వ్యక్తీకరించాలన్నారు. 
 
మహేష్ కత్తి అనుమతి లేకుండా నగరంలోకి వస్తే అరెస్టు చేసి, క్రిమినల్ కేసు పెట్టి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని డీజీపీ వెల్లడించారు. అతనిని చిత్తూరు జిల్లాలోని స్వస్థలం తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాదు నుంచి కత్తిని బహిష్కరించామన్నారు. 
 
శాంతికి భంగం కలిగించే రీతిలో వ్యాఖ్యలు చేయడం ద్వారా నగరంలో ఆందోళనలు ఉధృతమయ్యే అవాకాశాలుండటంతో అప్రమత్త చర్యల్లో భాగంగానే కత్తిని బహిష్కరించినట్లు డీజీపీ చెప్పుకొచ్చారు. కాగా ఓ వ్యక్తిపై నగర బహిష్కరణ విధించడం తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటిసారి. అయినప్పటికీ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.  
 
ఈ నేపథ్యంలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌ బహిష్కరణపై ఆయన తండ్రి ఓబులేసు మొదటిసారి స్పందించారు. నగర బహిష్కరణ చేయాల్సింది.. తన కుమారుడిని కాదని.. హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానంద స్వామినేనని చెప్పారు. ఆయన్ని దేశ బహిష్కరణ చేయాలన్నారు. మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
రాముడి గురించి తన కమారుడు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమేనని ఓబులేశు అన్నారు. రామాయణం విషవృక్ష పుస్తకం.. పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతోందన్నారు. తన కుమారుడు భార్యతో కలిసే వున్నాడని, విడిపోలేదన్నారు. తన కుమారుడు అవాస్తవాలు చెప్పడని, తన కుమారుడు ఏం మాట్లాడినా.. ఆధారం ఉంటేనే మాట్లాడుతాడని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు