బాలీవుడ్ మరో జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జంట ఎవరో కాదు.. కత్రీనా కైఫ్, విక్కీ జంట. కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమలో ఉన్నారని రెండేళ్లుగా రచ్చ సాగుతోంది. దాదాపుగా అందరు బీ-టౌన్ సెలబ్స్ పాటించే ఆచారాన్నే ఈ క్రేజీ కపుల్ కూడా ఫాలో అవుతూ వచ్చారు. అవునని చెప్పకుండా.. కాదని ఖండించకుండా ఎన్ని రూమర్స్ వచ్చినా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు.