ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల వినియోగం జరుగుతోందన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
పోలీసులు జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు, ఖరీదైన విదేశీ మద్యం సీసాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో పార్టీలో ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కొందరికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి.