శివ్ హరే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శుశాంత్, జాన్య జోషి, విధి వంటి కొత్త వారిని పరిచయం చేస్తున్నారు. విజయ్ రాజ్, మురళీ శర్మ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 21న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ హైదరాబాద్ లో నిర్వహించారు.
గణేష్ ఆచార్య మాస్టర్ మాట్లాడుతూ, మైత్రీ మూవీ మేకర్స్ లో పుష్ప 1, పుష్ప 2 చిత్రాలకు కలిపి దాదాపు ఐదేళ్ళు పని చేశాను. వాళ్ళతో వర్క్ చేస్తున్నపుడు ఫ్యామిలీతో వర్క్ చేసినట్లుగానే వుంటుంది. ప్రతిది ప్లాన్ గా చేస్తారు. ప్రతిది రెడీగా వుంటుంది. నేను వర్క్ చేసిన బెస్ట్ కంపెనీ ఇది. పుష్ప 'కిస్ కిస్ కిస్సిక్' సాంగ్ బిగ్ హిట్. ఇదే టైటిల్ తో ఈ సినిమా మార్చి 21న వస్తోంది. ఇందులో చాలా బ్యూటీఫుల్ కాన్సెప్ట్ వుంది. యాక్షన్ రియల్ షతీస్ చేశారు. తొమ్మిది పాటలు వున్నాయి. న్యూ ట్యాలెంట్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వీళ్ళకి ఎలాంటి సినీ నేపధ్యం లేదు. తెలుగు సినిమా నాకు చాలా నచ్చింది. బన్నీ, చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి గారు లాంటి బిగ్ స్టార్స్ తో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇక్కడ నటులకు, టెక్నిషియన్స్ కి గొప్పగా గౌరవిస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ నాకు చాలా ఇష్టం. ఇది ఫ్యామిలీ ఫిల్మ్. యాక్షన్ రోమాన్స్ సాంగ్స్ అన్నీ అలరిస్తాయి. సినిమా హిందీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషలో అందుబాటులో వుంది. తప్పకుండా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను'అన్నారు.
హీరో సుశాంత్, నాయికలు జాన్య జోషి, విధి మాట్లాడుతూ, హైదరాబాద్ రావడం తొలిసారి. తెలుగులో మమ్మల్ని ఆదిరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.