అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన నాగార్జున‌..!

గురువారం, 18 అక్టోబరు 2018 (18:46 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కించిన ఈ సినిమాకి పాజిటివ్ టాకే వ‌చ్చిన‌ప్ప‌టికీ ఫ‌స్ట్ క‌లెక్ష‌న్స్ ఓకే అన్న‌ట్టు వ‌చ్చాయి ఆ త‌ర్వాత నుంచి క‌లెక్ష‌న్స్ పుంజుకున్నాయి. ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైన‌ర్ కావ‌డంతో ఈ సినిమాకి అన్నివ‌ర్గాల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 61 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.
 
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ... మ‌ల్టీస్టార‌ర్ మూవీని డైరెక్ట్ చేయ‌డం అంటే చాలా క‌ష్టం. హీరోల‌కు ఈగోలు ఉంటాయి. ఒక్కోసారి డైరెక్ట్ పైన కోపంతో అరిచిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. కానీ... ఎక్క‌డా అత‌ను బెణ‌కకుండా ఈ సినిమా చాలా బాగా కంప్లీట్ చేసాడు. అత‌నికి మంచి భ‌విష్య‌త్ ఉంది. 
 
ఫ్యూచ‌ర్‌లో అద్భుతాలు సృష్టిస్తాడు అంటూ డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్యపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఈవిధంగా దేవ‌దాస్ షూటింగ్ టైమ్‌లో నాగ్, శ్రీరామ్ ఆదిత్య మ‌ధ్య ఏదో జ‌రిగింద‌నే విష‌యాన్ని ప్ర‌చారం నిజ‌మ‌ని చెప్ప‌క‌నే చెబుతూ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు నాగ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు