SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

దేవీ

సోమవారం, 28 ఏప్రియల్ 2025 (10:00 IST)
Nani- Rajamouli
నేచురల్ స్టార్ నాని క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. HIT: The 3rd Case మూవీ మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ రాత్రి ప్రీ రిలీజ్  ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
 
అనంతరం ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ, ఇండస్ట్రీలో మేమంతా ప్రశాంతిని హిట్ మిషన్ అని పిలుస్తుంటాము. తను 100% సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్. ఐదో సినిమాగా వస్తున్న హిట్ 3 మే 1 నా కంటిన్యూస్ అదే సక్సెస్ ట్రాక్ లోకి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం. మొన్న హిట్ త్రీ ఇంటర్వ్యూ చూస్తున్నాను. సినిమాకి సంబంధించి ఏదైనా విషయం బయటికి లీక్ అయినప్పుడు చాలా కోపం వస్తుంది. కానీ శైలేస్ చాలా కూల్ గా సెటిల్ గా మాట్లాడిన విధానం నాకు చాలా ఆకట్టుకుంది. తనపై గౌరవం ఏర్పడింది. చాలామంది ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు. కానీ అవి ఎంతకాలం ఉంటాయో తెలియదు. కానీ శైలేష్ హిట్ ఫస్ట్ కేసు అని క్రియేట్ చేసిన వెంటనే తర్వాత సెకండ్ కేస్ థర్డ్ కేస్ అనంతంగా ఉంటాయి కదా ఆటోమేటిక్గా థాట్ వస్తుంది. తనకున్న ఆలోచనలు ఏడే కావచ్చు. కానీ హిట్ ఫ్రాంచేజీ అంతకంటే ఎక్కువగా కొనసాగుతుందని నమ్ముతున్నాను. నాని ఏ సినిమా చేసిన హిట్ అని తెలుస్తుంది. తన్నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాని నేను ఎక్స్పెక్ట్ చేసిందని కంటే చాలా ముందుకు వెళ్లిపోయాడు. అయితే ఆశ తీరదు. నాని ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్నీ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని వైబ్ ని క్రియేట్ చేస్తున్నాయి. మే1 ఓన్లీ ఇన్ థియేటర్స్. ఆప్ కీ బార్ అర్జున్ సర్కస్. థాంక్యూ వెరీ మచ్'అన్నారు.
 
 నా వెనక రాజమౌళి, నా ముందు మీరు, కడుపులో వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది
 
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ,  రాజమౌళి గారితో నాకు ఒక సెంటిమెంట్ ఉండేది. మేము ప్రతి కొత్త సినిమాని ప్రసాద్ ఐమాక్స్ లో చూసేవాళ్ళం. సినిమా రిజల్ట్, సినిమా ఎలా ఉందని ఆయన అడిగే తెలుసుకునేవాడిని, కానీ ఇప్పుడు అటువైపు వెళ్ళటం లేదు. మే1న ఆయనకి ఏ పనులు ఉన్నా సరే.. ఒకవేళ ఆయనకి ట్రావెల్ ఉంటే ఆయన పాస్ పోర్ట్ నేను లాగేసుకుంటా. మీరు సినిమా చూసి మళ్లీ ఆ ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమాని ఆయన ఎంజాయ్ చేస్తారని నమ్మకం నాకుంది. 
 
రాజమౌళి గారికి నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అని ఫీల్ అయినట్టుగా చేసిన ఆయన ఫ్యామిలీ అందరికీ థాంక్యు. సినిమా డిక్షనరీ లోకి వెళ్లిపోయిన ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి. సినిమాల్లో ఏదైనా ఒక రిఫరెన్స్ పాయింట్ మాట్లాడుకున్నప్పుడు రాజమౌళి గారి సీన్ లా ఉండాలి అని మాట్లాడుకుంటాం. అలాంటి ఒక సీక్వెన్స్ హిట్ 3 లో వుంది. విశ్వక్సేస్మ శేష్ హిట్ వెర్స్ కి పిల్లర్స్. వాళ్లు బిల్డ్ చేసినది నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తున్నాం. ఈ ఫంక్షన్ కి వాళ్ళు కూడా రావడం ఒక ఫ్యామిలీ ఫంక్షన్  అన్న ఫీలింగ్ ఇచ్చింది.శైలేష్ స్ట్రెంత్ నాకు తెలుసు. తనలో ఉన్న స్ట్రెంత్ ని తను ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాడని నేను అనుకోవట్లేదు. తన స్ట్రెంత్ తాలూక ట్రైలర్ ని మే1న చూడబోతున్నారు. సానుగారు నా ఫేవరెట్ డిఓపి. క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు. మా టీమ్ అందరికీ స్పెషల్ థాంక్స్.మిక్కీ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు . 
 
ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది. ఐదు నిమిషాలు దేవుడు ముందు నిలబడ్డాను. ఈరోజు మధ్యాహ్నం క్యూబ్ లో సినిమా చూశాను. మే ఫస్ట్ కి మీ అందరికీ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్.. మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు. నా వెనక రాజమౌళి గారు ఉన్నారు. నా ముందు మీరు ఉన్నారు. మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది. కడుపులో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. కళ్యాణ్ గారు స్టైల్ లో చెప్పాలంటే మనల్ని ఎవడ్రా ఆపేది. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. మా టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్. మే1న వస్తున్న సినిమాలు అన్నీ విజయం సాధించాలి. మనందరం థియేటర్స్ లో కలిసి చాలా ఎంజాయ్ చేయాలి. థాంక్యూ సో మచ్'అన్నారు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు