ఈ చిత్రంలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్గా నయన్ సారిక నటిస్తుంది. ఆయ్, క వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ5 వారి హలో వరల్డ్, సోనీ లివ్ వారి బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌ల్లో ద్వారా తెలుగు కి పరిచయం అయ్యారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన బెంచ్ లైఫ్‌కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఆంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ప్రధాన పాత్రలో నటించారు.