మెగా డాటర్ వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ వివాహం కోసం నాగబాబు రూ. 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని టాక్ వస్తోంది. కనులపండువగా జరిగిన మెగా వెడ్డింగ్‌లో చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ, సుస్మిత, స్నేహా రెడ్డి తదితరులు సందడి చేశారు.