'జీ 5' ఒరిజినల్ మూవీ 'స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్' మరికొన్ని గంటల్లో 'జీ 5' ఓటిటి వేదికలో విడుదల కానుంది. జూలై 9, అనగా శుక్రవారం హిందీ, తమిళ్, తెలుగులో ఏకకాలంలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు వీక్షకులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇందులో ప్రముఖ హిందీ నటుడు అక్షయ్ ఖన్నా నటించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన యూనిఫామ్‌లో కనిపిస్తుండటం విశేషం. 'స్టేట్ ఆఫ్ సీజ్:26/11'లి ఎన్ఎస్జీ కమాండోగా నటించిన వివేక్ దహియాను ఈ ఒరిజినల్ మూవీలోనూ చూడవచ్చు. వీరితో పాటు గౌతమ్ రోడె, సమీర్ సోని, పర్వీన్ దబాస్, మంజరి ఫడ్నవీస్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం.
వాస్తవ ఘటనల స్ఫూర్తి
వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందించిన 'స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్' మన భారత సైనికులకు నివాళి. భారతీయుల ధైర్యానికి వందనం ఇది. 'స్టేట్ ఆఫ్ సీజ్' ఫ్రాంచైజీలో మరిన్ని చిత్రాలు రానున్నాయని 'జీ 5' వర్గాలు తెలిపాయి. అమాయక ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఉగ్రవాదులను ధైర్యంగా బంధించేందుకు/మట్టుబెట్టేందుకు ఎన్ఎస్జీ సదా తన సంకల్పాన్ని, సంసిద్ధతను ప్రదర్శిస్తునే ఉంటుంది. ఆలయంపై జరిగిన భయానక దాడి ఘటనల వెనుకున్న యాక్షన్ దృశ్యాలను ఈ చిత్రం మీ ముందు ఉంచుతుంది. థ్రిల్, యాక్షన్, డ్రామా, సస్పెన్స్‌తో నిండి ఉన్న ఈ చిత్రం వీక్షకులను మునివేళ్లపై నిలబెడుతుంది.
దర్శకుడు కెన్ ఘోష్ మాట్లాడుతూ, ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. మనల్ని కాపాడేందుకు అనుక్షణం తమ ప్రాణాలను పణంగా పెట్టే ఎన్ఎస్జీ కమాండోలు నివాళి ఇది. నౌకాదళ అధికారి కుమారుడిగా నేను సైనిక దళాల శక్తియుక్తులను చూస్తూ పెరిగాను. 'స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్'లో మన హీరోలకు నివాళి అర్పించేందుకు మా వంతు కృషి మేము చేశాం. 'జీ 5'లో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నాను” అన్నారు.