అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

ఐవీఆర్

మంగళవారం, 13 మే 2025 (16:02 IST)
దేశంలో సంచలనం సృష్టించింది తమిళనాడులోని పొల్లాచి లైంగిక వేధింపుల కేసు. ఈ కేసుకు సంబంధించి 9 మందిని దోషులుగా నిర్ణయిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డ 9 మంది పురుషులకు బ్రతికున్నంతవరకూ జైలుశిక్షను విధించింది. వీరి బారిన పడ్డ మహిళలకు రూ. 85 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 
 
ఈ కేసుకు సంబంధించి వివరాలను చూస్తే... సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని ప్రేమిస్తున్నానంటూ వారిపై అత్యాచారాలు చేసేవారు. ఆ తర్వాత లైంగిక దాడి చేస్తూ వీడియోలు తీసి వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసేవారు. ఎవరికైనా నిజం చెబితే వీడియోలను ఇంటర్నెట్లో అప్ లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగేది ఆ ముఠా. ఈ ముఠాలో శబరిరాజన్, తిరునావుక్కరసు, సతీష్, వసంత్ కుమార్, మణివణ్ణన్, బాబు, పాల్, అరుళానందం దోషులుగా తేలారు.
 
2019లో బాధిత మహిళలు ఫిర్యాదుతో వీరి అఘాయిత్యాలు బైటపడ్డాయి. వందలాదిమంది అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడ్డట్టు విచారణలో తేలింది. సీబీఐ దర్యాప్తులో 9 మందిపై కుట్ర, లైంగిక వేధింపులు, అత్యాచారం, సామూహిక అత్యాచారం, పదేపదే అత్యాచారం వంటి అభియోగాలు నమోదయ్యాయి. కేసులో వాదోపవాదాలు విన్న కోర్టు వీరిని దోషులకు తేల్చి శిక్ష విధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు