మెగాస్టార్ పుట్టినరోజుకు గెస్ట్ ఎవ‌రో తెలుసా..?

బుధవారం, 21 ఆగస్టు 2019 (13:07 IST)
మెగాస్టార్ పుట్టినరోజు ఈ నెల 22వ తేదీ. ఆ రోజు అభిమానులకు పండ‌గ రోజు. ప్ర‌తి సంవ‌త్స‌రం చిరు పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను అభిమాల‌ను భారీస్థాయిలో చేస్తుండ‌టం చూస్తుంటాం. ఈ సంవ‌త్స‌రం కూడా అదే స్థాయిలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసారు. ఇదిలావుంటే... హైద‌రాబాద్‌లో చిరు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. 
 
అవును... ప‌వ‌ర్ స్టార్ ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. ఈ నెల 22వ తేదీన పుట్టినరోజు జరుపుకోబోతున్న సందర్భంగా మెగా అభిమానుల వేడుకలు మొదలుకానున్నాయి. ఒక రోజు ముందే అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా అభిమానులు పుట్టినరోజు కార్యక్రమాన్ని జరపనున్నారు. ఈ వేడుకకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక మెగా అభిమానుల‌కు పండ‌గే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు