Suresh Reddy Kovvuri, Virendra Sharma
దశాబ్దకాలం స్థాపించిన ప్రఖ్యాత యానిమేషన్ అండ్ గేమింగ్ కళాశాల 'క్రియేటివ్ మెంటార్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ రోజు (మే 22) న యు కె పార్లమెంట్, హౌస్ అఫ్ కామెన్స్, లండన్ లో నిర్వహించిన యు కె బిజినెస్ మీట్ నుండి ప్రతిష్టాత్మకమైన 'మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్' అవార్డును అందుకున్నారు. కన్నుల పండువగా జరిగిన కార్యక్రమం లో క్రీయేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ ద్వారా యానిమేషన్ కు చేసిన విశేష కృషికి గుర్తింపుగాను UK పార్లమెంట్ సభ్యుడు శ్రీ వీరేంద్ర శర్మ ఈ అవార్డును శ్రీ సురేష్ కొవ్వూరి కి అందిందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ సల్మాన్ ఖుర్షిడ్, శ్రీ మనోజ్ కుమార్, శ్రీమతి తేజస్వి యాదవ్, శ్రీమతి మహువ మెహతా, శ్రీ సీతారాం ఏచూరి మరియు తెలంగాణ నుండి శ్రీ జయేష్ రంజన్ లతో సహా పలువురు కార్పొరేట్ అధిపతులు పాల్గొన్నారు.