తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజz అరంగేట్రానికి ముహూర్తం ఖరారైపోయిందా? అంటే అవునంటున్నాయి.. కోలీవుడ్ వర్గాలు. తమిళనాట రాజకీయాలు అంతంత మాత్రంగానే ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే మంచి తరుణమని రజనీకాంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
రజనీ రాజకీయాల్లో రావడంపై స్థానికతను సాకుగా చూపుతూ.. భారతీ రాజావంటి ప్రముఖ దర్శకులు కామెంట్లు చేసినా.. వాటిని పక్కనబెట్టి ప్రజా సేవకు స్థానికతకు సంబంధం లేదని రజనీకాంత్ రుజువు చేస్తారని తలైవా ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే సినీ లెజెండ్ కమల్ హాసన్‌కు కూడా తలైవా ఫ్యాన్స్ చురకలంటిస్తున్నారు. కెమెరా ముందు నిలబడాలనే తాపత్రయం తమ నాయకుడికి లేదని.. రాజకీయాల్లోకి రావడంపై ఎందరూ ఒత్తిడి తెచ్చినా ఆయన కెమెరా ముందుకొచ్చి చెప్పలేదనే విషయాన్ని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఇటీవల ఫ్యాన్స్‌ను కలిసిన సందర్భంగా "దేవుడు ఆదేశిస్తే.. రాజకీయాల్లో వస్తానని" ప్రకటించారు. ఇంకా ప్రముఖులతో తమిళ రాజకీయాలపై పరిశీలన చేస్తున్న రజనీకాంత్.. పార్టీ జెండా, పేరును కూడా ఖరారు చేసినట్లు సమాచారం.