స్నేహితుడిని వివాహం చేసుకుంటే సరదాలే ఎక్కువు : రకుల్ ప్రీత్ సింగ్

ఠాగూర్

సోమవారం, 9 డిశెంబరు 2024 (18:33 IST)
స్నేహితుడుని వివాహం చేసుకుంటే జరిగే మార్పుల కంటే జీవితంలో ఎక్కువ సరదాలే ఉంటాయని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. పెళ్లి తర్వాత జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయ? అని తనను ఎంతో మంది అడిగారని, తన జీవింతలో అంత పెద్ద మార్పు అంటూ ఏమీ రాలేదని ఆమె చెప్పారు. కాగా, రెండు నెలల క్రితం 80 కేజీల బరువును ఎత్తే క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ గాయపడ్డారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
దీనిపై రకుల్ స్పందిస్తూ, గాయం నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్నానని చెప్పారు. వెన్నుకు గాయమైనపుడు రెండు వారాల్లో తగ్గిపోయిందని భావించానని, కానీ, ఇప్పటికీ ఎనిమిది వారాలు అయిందన్నారు. ప్రస్తుతం ఎక్కువ బరువులు ఎత్తడం లేదని చెప్పారు. 
 
చిన్న చిన్న వర్కౌట్లు చేస్తున్నానని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నానని చెప్పారు. బరువు  తగ్గడం ఎంతో కష్టమైన పని అని ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. 
 
జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలని, రెగ్యులర్ వర్కౌట్లు చేయాలని చెప్పారు. మంచినీళ్లు ఎక్కువగా తాగాలని ఆమె సూచించారు. ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీరు లేదా పసుపు కలిపిన గోరు వెచ్చటి నీరు తాగితే చర్మం కాంతివతంగా తయారవుతుందని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు