గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా, చిరంజీవి, సురేఖ గారు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం లండన్ వెళుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫొటోకూడా పెట్టారు. ఈ విగ్రహ ఆవిష్కరణ లండన్‌లో మే 9, 2025న స్థానిక సమయం సాయంత్రం 6:15 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా అభిమానులు అక్కడ సంబరాలకు ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది.