రొమాంటిక్‌లో శివగామి.. ఆమె పాత్రే కీలకమట..

బుధవారం, 16 అక్టోబరు 2019 (12:13 IST)
బాహుబలి సినిమాలో శివగామి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు అగ్రహీరోలతో జతకట్టిన శివగామి.. ప్రస్తుతం పవర్ ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందట.
 
ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరగనున్న షెడ్యూల్‌లో రమ్యకృష్ణ పాల్గొనబోతోందని సమాచారం. ఇక ఈ చిత్రానికి అనీల్ పాడూరి దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ నటులు మకరంద్ దేశ్ పాండే, మందిరాబేడీ కీలకపాత్రలో నటిస్తున్నారు.  
 
పూరి, ఛార్మిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కేతికా శర్మ కథానాయిక. 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో మంచి విజయం అందుకున్న పూరీ జగన్నాథ్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు