యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రవితేజ

డీవీ

శనివారం, 24 ఆగస్టు 2024 (15:00 IST)
Ravi teja
గురువారంనాడు ఆర్.టి. 75 సినిమా షూటింగ్ లో కుడిచేతి దగ్గర కండరం విరిగింది. తన వెంబటే వున్న డాక్టర్ ఇచ్చిన స్ప్రే వేయగానే కొంత ఉపశమనం జరిగింది. దాంతో మరలా షూటింగ్ లో పాల్గొనడంతో దురద్రుష్ట వశాత్తూ పరిస్థితి తీవ్రతరం అయింది. ఆ వెంటనే ఆయన్ను చిత్ర యూనిట్ యశోధ ఆసుప్రతికి తీసుకెళ్ళారు. 
 
డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. కొద్దిరోజులపాటు షూటింగ్ కు విరామం చెప్పాలని తెలిపారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటూ పలు సందేశాల ద్వారా తెలియజేశారు.
 
కాగా, శనివారంనాడు సోషల్ మీడియా ఎక్స్ లో  రవితేజ పోస్ట్ చేస్తూ, తాను డిచ్చార్జ్ అయినట్లు తెలిపారు. సాఫీగా సాగిన సర్జరీ తర్వాత విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యాను. మీ అందరి ఆశీర్వాదాలు మరియు మద్దతుకు కృతజ్ఞతలు
 
రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు