యూనిక్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే 'మా తిరుపతి' పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రమోషనల్ మెటీరియల్ మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తేది ఖరారైయిది. నవంబర్ 18న ఈ చిత్రం థియేటర్లో విడుదలౌతుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు రూపొందించిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంది. వింటేజ్ డేస్ ని గుర్తుకు తెస్తూ దండోరా వేయించడం అలరిస్తోంది.
నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తుండగా, డిజికె డీవోపీగా పని చేస్తున్నారు.