విడుదలకు అల్లంత దూరాన

బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (09:03 IST)
Vishwa Karthikeya, Hritika Srinivas
గతంలో బాలనటుడిగా ఆ తర్వాత హీరోగా రాణిస్తున్న  విశ్వ కార్తికేయ తాజాగా నటించిన సినిమా  "అల్లంత దూరాన".. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ నాయిక గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలిపారు. తెలుగులో విడుదల తర్వాత మంచి డేట్ చేసుకుని తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. 
 
"కథ కథనాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ తీసిన సినిమా ఇది.  హైదరాబాద్ తో పాటు కార్వేటినగరం, పుత్తూరు, తిరుపతి, ఆర్.కె.వి.పేట, కేరళ, చెన్నై, పాండిచ్చేరి తదితర లొకేషన్లలో షూటింగ్ చేశాం. తెలుగుతో పాటు కొందరు ప్రముఖ తమిళ నటీనటులు కూడా ఇందులో నటించారు" అని చెప్పారు.  
చిత్ర దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, "ఫీల్ గుడ్ లవ్ స్టోరీ  చిత్రమిది. చాలా క్వాలిటీగా చిత్రాన్ని తీశాం. నిర్మాత సంపూర్ణ సహకారంతోనే ఓ మంచి చిత్రాన్ని తీయగలిగాం. రాంబాబు సాహిత్యం, రధన్ సంగీతం అందరినీ హత్తుకునేలా చేస్తాయని, ఇప్పటికే పాటలు అందరినీ అలరింపజేస్తున్నాయి. కళ్యాణ్ ఛాయాగ్రహణం కనువిందు చేస్తుంది" అని అన్నారు.
హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ, ఇలాంటి చిత్రంలో నటించడం తన  కెరీర్ కు మంచి మలుపు అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో భాగ్యరాజా, అలీ,  ఆమని, తమిళ్ జేపీ, తులసి,  జార్డమేరియన్, అప్పాజీ, అనంత్ ,  ఇళవరసన్, డానియెల్, స్వామినాథన్, కృష్ణవేణి, నారాయణరావు, శివ తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి పాటలు: రాంబాబు గోశాల, సంగీతం: రధన్ (జాతి రత్నాలు ), కెమెరా: కళ్యాణ్ బోర్లగాడ్డ, ఎడిటింగ్: శివకిరణ్,
డాన్స్: గోపి, ఫైట్స్: నాభ, ఆర్ట్: చంద్రమౌలి, సమర్పణ: శ్రీమతి కోమలి, నిర్మాత: ఎన్.చంద్రమోహనరెడ్డి, రచన-దర్శకత్వం: చలపతి పువ్వల.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు