రోచిశ్రీ మూవీస్ నిర్మాణంలో రమణ మొగిలి దర్శకత్వంలో రూపొందుతన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షూటింగ్లో రాయ్‌లక్ష్మీ, విలన్లు ప్రదీప్‌రావత్, సీనియర్ నటుడు సురేష్, ఇతర 18 మంది ఫైటర్స్‌తో అండర్‌వాటర్‌లో భారీగా చిత్రీకరిస్తున్న యాక్షన్ సీక్వెన్సీలో లక్ష్మీరాయ్‌కి కాలుకి గాయమైంది. ప్రముఖ హాస్పటల్లో చికిత్స పొందిన అనంతరం ఆమెక్షేమంగా, పూ ర్తి ఆరోగ్యంతో డిశ్చా్ర్జ్ అయినట్లుగా త్వరలోనే ఆమె చిత్రీకరణలో కూడా పాల్గొంటుందని చిత్రబృందం తెలిపింది.