విమర్శకుల ప్రశంసలు పొందిన నెట్‌ఫ్లిక్స్ సినిమా బండి దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన తాజా ప్రాజెక్ట్ 'పరధ' తో తిరిగి వస్తున్నారు. నిర్మాతలు రాజ్, డికె సారథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఇప్పటికే దాని వింతైన, ఆసక్తికరమైన టీజర్‌తో సంచలనం సృష్టించింది. ముగ్గురు మహిళల కథతో రూపొందింది. పల్లెటూరి అమ్మాయిగా అనుపమ నటించింది. సినిమా చివరలో వచ్చే కీలక పాత్రలో సమంత నటించింది.