తమిళ బిగ్ బాస్ షోకు ప్రస్తుతం భారీ క్రేజ్ లభిస్తోంది. దేశ వ్యాప్తంగా ''సేవ్ ఓవియా'' హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో అగ్రస్థానంలో నిలిచింది. బిగ్ బాస్ షోలో నటి ఓవియాను బిగ్ బాస్ టీమ్ ఏడ్పించినట్లు ఓ ప్రోమో వీడియోను విజయ్ టీవీ విడుదల చేసింది. అంతే ఓవియాకు మద్దతుగా నెటిజన్లు పోస్టులు చేశారు. తమిళ బిగ్ బాగ్‌లో పాల్గొంటున్న నటీమణులు గాయత్రి, నమిత, జూలీల వల్లే ఓవియా కంట నీరు పెట్టుకుందని నెటిజన్లు వారిని తిట్టిపోశారు.
ఓవియాకు మద్దతుగా తమిళ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామంటూ మీమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అందులో కొందరు ఓవియా లేని బిగ్ బాస్ షోను చూసేది లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సేవ్ ఓవియా అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జియోఫోన్, ముకేష్ అంబానీలను కూడా ఓవియా వెనక్కి నెట్టిన ఓవియా.. ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌లో టాప్‌లో నిలిచింది.