కేకే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే సీపీఆర్ చేసివుంటే బతికుండేవారు..?

గురువారం, 2 జూన్ 2022 (18:33 IST)
KK
గాయకుడు కృష్ణకుమార్ కున్నథ్ మరణంపై వైద్యుడి వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కోల్ కతాలో ఓ సంగీత కచేరీలో అస్వస్థతకు గురైన కేకేను కోల్‌కతాలోని సీఎంఆర్ఐ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా, కేకే భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తయింది. 
 
అనంతరం ఓ వైద్యుడు స్పందిస్తూ, అస్వస్థతకు గురైన వెంటనే సీపీఆర్ చేసుంటే కేకే బతికుండేవాడని అభిప్రాయపడ్డారు. కేకే చాలాకాలంగా హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. కేకే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే సీపీఆర్ చేసి ఉన్నట్టయితే అతడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని పేర్కొన్నాడు.
 
కేకే గుండెకు దారితీసే నాళాల్లో అనేక అడ్డంకులు (హార్ట్ బ్లాకేజస్) గుర్తించామని వెల్లడించారు. సంగీత కచేరీలో పాడడం, డ్యాన్స్ చేయడం ద్వారా కేకే తీవ్ర ఉద్విగ్నతకు గురై ఉంటాడని, దాంతో రక్తప్రసరణ నిలిచిపోయి కార్డియాక్ అరెస్ట్ సంభవించిందని, అదే కేకే మరణానికి దారితీసిందని ఆ వైద్యుడు వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు