సింగర్ సునీత ఇంటర్వ్యూ.. ఆ క్లారిటీతోనే అడుగులు వేస్తున్నా..

సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (10:59 IST)
సింగర్ సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలూగారిని పోగొట్టుకున్నానని తెలిపారు. ఆ సంఘటన తర్వాత తాను కన్నీళ్లు రావడం ఆగిపోయాయని చెప్పారు.
 
అంతకుమించి చలించే సంఘటనలు ఏముంటాయని ప్రశ్నించారు. అంతగా తనను ఇక ఏ సంఘటనలు కదిలించడం లేదని తెలిపారు. ఆయన జ్ఞాపకాలతో ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకు మనమిచ్చే గౌరవం అన్నారు. 
 
జీవితంలో తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయని, బాధ్యతలు వున్నాయని తెలిపారు. తనను ద్వేషించేవారినీ .. విమర్శించేవారిని పట్టించుకోకుండా, తన ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికే ప్రయత్నిస్తూ వెళ్లానని చెప్పారు. తాను ఏం చేయగలిగానో తనకు తెలుసునని ఆ క్లారిటీతోనే అడుగులు వేస్తున్నానని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు