కొన్ని పాటలు వినగానే అర్ధమవుతాయి, ఇంకొన్ని పాటలు వినగా వినగా అర్ధమవుతాయి.అలాంటి పాటలు ఎప్పుడో వస్తాయి, సాహిత్య విలువలను గుర్తుచేస్తూ మన మనసుకు ప్రశాంతత ను ఇస్తాయి. ఈ మధ్యకాలంలో వినసొంపైన పాటలు ఎన్ని వచ్చినా, వాటిలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న "వినరో భాగ్యము విష్ణు కథ" చిత్రంలోని "వాసవ సుహాస" పాటది మాత్రం ప్రత్యేకమైన స్థానం అని చెప్పొచ్చు.