టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు... హీరో తరుణ్ వాటిని ఆశ్రయించాడా?(వీడియో)

శనివారం, 22 జులై 2017 (14:53 IST)
సినీనటుడు తరుణ్ డ్రగ్స్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌లో మొదటగా డ్రగ్స్ వాడిన హీరో తరుణేనంటూ అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఐతే తన నిజాయితీ ఏమిటో సిట్ అధికారులు ముందు తెలుపుతానంటూ విచారణకు హాజరయ్యే ముందు తరుణ్ వెల్లడించారు. 
 
కాగా తరుణ్ ప్రస్తుతం సినిమాలు లేక కాస్త ఒత్తిడిలో వున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అలాగే ఇంతకుముందు నటి ఆర్తీ అగర్వాల్ ప్రేమ విషయంలోనూ వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో తరుణ్ పేరు రావడంతో ఆయనకు డ్రగ్స్ అలవాటు వుందా... ఒత్తిడి కారణంగా, సినీ ఛాన్సులు రాని కారణంగా ఆయన ఏమయినా మత్తును ఆశ్రయించాడా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఏదేమైనప్పటికీ సినీ ఇండస్ట్రీకి చెందిన తారలు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం కాస్త ఆవేదన చెందాల్సిన విషయమే. డ్రగ్స్ కేసుకు సంబంధించి వీడియో చూడండి.

వెబ్దునియా పై చదవండి