మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్న బ్యూటీ శోభిత ధూళిపాళ్ళ. ఈమె బాలీవుడ్‌లో తొలుత ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడవిశేష్ హీరోగా నటించిన "గూఢచారి" చిత్రంలో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే వచ్చాయి.
ఈనేపథ్యంలో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న ఆమెకు ఫ్యాషన్ నేపథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఈమెకు ఫోటోషూట్స్ కొత్తేమీ కాదు. రీసెంట్‌గా ఒక హాట్ ఫోటోషూట్‌లో పాల్గొని ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.
పైన బటన్లు లేకుండా ఒక కోటు మాత్రం వేసుకొని క్లీవేజ్ షో చేస్తూ ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. యాక్సెసరీస్ అసలే వేసుకోలేదు. పేరుకి తెలుగు అమ్మాయే అయినా ఈ ఫొటోను ఆమె ఎవరో తెలియని వాళ్ళకి చూపిస్తే శోభితను ఒక ఇంటర్నేషనల్ మోడల్ అనుకోవడం ఖాయం.