దర్శకుడు బాబీ మాట్లాడుతూ, బాలక్రిష్ణ కు లైబ్రరీ ఫిలిం అవ్వాలని అనుకున్నాం, అందరూ మాస్టర్ పీస్ అంటున్నారు. అందుకు గర్వంగా వుంది. నాకు రైటింగ్ అంటే ఇష్టం. 10 ఏళ్ళ పాటు రచయితగా వున్నా. ఆ అనుభవంతో బాలక్రిష్ణ ను బెస్ట్ గా చూడాలని చేశాం. గ్లిజరిన్ లేకుండా ఓ సీన్ లో ఆవేశంతో బెస్ట్ సీన్ చేశారు. షూటింగ్ లో క్లాప్స్ పడ్డాయి బాలయ్య నటనకు అని చెప్పారు.