లవర్ బాయ్‌గా వరుణ్ తేజ్ నటించిన "తొలిప్రేమ" సినిమాకు 100 మార్కులు ఇచ్చారీ దర్శకధీరుడు. దర్శకుడు వెంకీ సినిమాను అద్భుతంగా తీశారు. సినిమా చాలా బాగుంది. వరుణ్ తేజ్ సినిమాలో బాగా నటించారు. రాశీ ఖన్నా నటన కూడా చాలా చాలా బాగుంది. దర్శకుడు వెంకీ అద్భుతంగా సినిమాను తీశాడంటూ రాజమౌళి కితాబిచ్చాడు. 'తొలిప్రేమ' సినిమాను రాజమౌళి ఈ స్థాయిలో పొగడడం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.