వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు. చాలా సాదాసీదాగా సినీ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆచితూచి కథలను ఎన్నుకుంటూ చక్కగా కెరీర్ బిల్డప్ చేసుకుంటున్నాడు. ఇదంతా ఎందుకయా అంటే... ఈరోజే ఫిబ్రవరి 10న విడుదలైన తొలిప్రేమ చిత్రం గురించి చెప్పడానికే. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ చూపించిన నటన కానీ ఫైట్స్ కానీ చాలా బావున్నాయి. అతడి నటనకు ఈ చిత్రంలో ఫుల్ మార్కులు వేసేయవచ్చు. ఇదే రీతిలో కొనసాగితే మాత్రం అతడికంటూ హ్యూజ్ ఫాలోయింగ్ క్రియేట్ కావడం ఖాయం. ఇకపోతే తొలిప్రేమ చిత్రం ఎలా వుందో చూద్దాం.
కథగా చెప్పాలంటే... ఆదిత్య(వరుణ్ తేజ్) వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లే రెలెక్కుతాడు. ఈ రైల్లో అనుకోకుండా వర్ష(రాశిఖన్నా) పరిచయమవుతుంది. షరా మామూలే. తొలిచూపులోనే తొలిప్రేమలో పడిపోతాడు. ఐతే అనుకోకుండా ట్రైన్ దిగిపోవడం ఆమెను మిస్ అవడం మళ్లీ కలవడం... ఇలా చివరికి ఇంజినీరింగ్ కాలేజీలో కలుస్తారు ఇద్దరు. కాలేజీ సీనియర్స్ మధ్య చెలరేగిన గొడవల్లో వీళ్లద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఆ తర్వాత ఆరేళ్లకు అనుకోకుండా లండన్ నగరంలో కలుసుకుంటారు. అప్పుడు వారి పరిస్థితి ఏంటి? మళ్లీ ఇద్దరు కలుసుకుంటారా? విడిపోతారా? ప్రేమ సఫలమవుతుందా అన్నది స్టోరీ.
ఇక నటీనటుల నటన గురించి చెప్పుకుంటే వరుణ్ తేజ్‌కు ఈ చిత్రంలో నూటికి నూరు మార్కులు వేసేయవచ్చు. రాశీఖన్నా కూడా భిన్నంగా కనిపించింది. గ్లామర్ పాత్రలకే పరిమితం అనే టాక్ నుంచి బయటకు వచ్చేసింది. చక్కని నటన కనబరిచింది. అందమైన అమ్మాయిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక పాటలు, లొకేషన్లు ఎక్కడికక్కడ చాలా బ్యూటీఫుల్‌గా చిత్రీకరించారు. థమన్ సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అని చెప్పవచ్చు. దర్శకుడు కొత్తవాడయినప్పటికీ వెంకీ చాలా చక్కగా తీశాడు. మొత్తమ్మీద ఈ చిత్రం అటు యూత్ కి ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు చక్కగా కనెక్ట్ అవుతుంది. వరుణ్ తేజ్‌కు ఫిదా తర్వాత మరో హిట్ ఖాయం అని చెప్పవచ్చు. వీడియో రివ్యూ...