టాలీవుడ్ హీరోలలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు రూటే సపరేటు. తనదైన నటనతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ హీరోకు వయస్సుతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. టాలీవుడ్‌లో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న కొద్ది మంది హీరోలలో మహేష్‌బాబు ఒకరు. మహేష్‌బాబును అభిమానుల హీరో అని అంటుంటారు.
సేవా కార్యక్రమాలను చేపట్టడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటాడు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో రెండు గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. గతంలో కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల కోరిక మేరకు వారిని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమా ఫంక్షన్‌లలో, అలాగే తనను కలవడానికి వచ్చిన అభిమానులతో ఫోటోలు దిగుతాడు.