గాయని సుచిత్ర వైద్యం కోసం లండన్ వెళ్లి ఉండవచ్చు. తన ట్విట్టర్ హ్యాక్ అయిందని ఆమె తప్పుకుని ఉండవచ్చు. భర్తే ఆమెకు విడాకులు ఇస్తున్నానని చెప్పి వుండవచ్చు. కానీ సుచిత్ర సంధించిన వరస పోస్టుల దాడి ఇంతటితో సద్దుమణిగేలా లేదు. తమను చూపిస్తున్న నగ్న వీడియో ఏదైనా కనబితే చాలు. మార్ఫింగ్ అని, సైబర్ క్రైమ్ అని ప్రకటించి ఈజీగా తప్పుకునే నటీమణులు ఇప్పుడు సుచిత్ర పోస్ట్ చేస్తున్న ఒరిజనల్ వీడియోలు చూసి గుక్క తిప్పుకోలేకుండా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎవరనీ వదలకుండా మహా నటీనటుల భాగోతాలను సోషల్ మీడియా వీడియోలతో కొడుతున్న సుచిత్ర అసలు ఉద్దేశం ఏమిటి?
సింగర్ సుచిత్ర ట్విటర్ అకౌంట్ ద్వారా పోస్టు అవుతున్న వివాదాస్పద ట్వీట్లలో ఒకే ఒకరు పదే పదే టార్గెట్ అవుతున్నారు. మాటెత్తితే అతడిపై ధ్వజమెత్తుతోంది సుచిత్ర. అతడికి విలువలు లేవని.. అతడు మంచో కాడని.. అతడి రాసలీలలు చాలా ఉన్నాయని.. అతడు తనను కూడా అత్యాచారం చేశాడన్నట్టుగా ట్వీట్లు పెడుతోంది. ఇలా టార్గెట్ అవుతోంది మరెవరో కాదు.. తమిళ స్టార్ హీరో ధనుష్.
వివాదాస్పద ట్వీట్ల ను పెట్టడం మొదలుపెట్టడంతోనే ధనుష్ ను లక్ష్యంగా చేసుకుంది సుచిత్ర. తన ఒంటికి అయిన గాయాన్ని చూపుతూ.. దాన్ని చేసింది ధనుషే అనే అర్థం వచ్చేలా ట్వీట్ పెట్టింది. ఆ తర్వాత తన అకౌంట్ హ్యాక్ గురయ్యిందని పేర్కొంది. ఆ తర్వాత మళ్లీ పాత పాటే పాడుతూ.. ధనుష్, అనిరుధ్ లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ట్వీట్లు పెట్టింది.
అనిరుధ్ కు సంబంధించి వివిధ ఫొటోలను పోస్టు చేసింది. మిగతా సెలబ్రిటీలకు సంబంధించిన వివాదాస్పద ఫొటోలను కూడా ఆమె పోస్టు చేసింది. అయితే.. ఎటొచ్చీ ధనుష్ ను మాత్రం పదే పదే టార్గెట్ చేసింది. ధనుష్ అభిమానులు తనపై విరుచుకుపడవద్దని.. అతడికి వ్యక్తిత్వం లేదని, అతడి లీలలు చాలానే ఉన్నాయని ఆమె ట్వీట్లు పెట్టింది. అంతే కాదు.. సినిమాల్లో ధనుష్ చేసిన కొన్ని రొమాంటిక్ సీన్ల కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ.. ధనుష్ మంచోడు కాదనే తన అభిప్రాయాలను పోస్టు చేసింది సుచిత్ర.