'అమ్మాయిలు హానికరమా' అనే ప్రశ్నకు సినీ నటుడు చలపతిరావు చెప్పిన సమాధానంపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చలపతిరావు చేసిన కామెంట్లు ఖచ్చితంగా తప్పేనని... కాదని తాను అననని, కానీ ఒక లేడీ యాంకర్ ఆడవాళ్లు హానికరమా అని అడగొచ్చా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.పైగా, ఈ వివాదాన్ని మీడియాపై భూతద్దంలో చూపిందని, మీడియాకు చలపతిరావు ఓ లడ్డూలా దొరికారని అన్నారు.
దీనిపై తమ్మారెడ్డి తాజాగా స్పందించారు. అసలు యాంకర్ ఆ తరహా ప్రశ్న వేయవచ్చా, చలపతి రావు చెప్పిన సమాధానానికి మగ యాంకర్ సూపర్ సమాధానం అని అనొచ్చా... అక్కడ కూర్చున్న ఆడియన్స్ అంతా దాన్ని ఎంజాయ్ చేయొచ్చా? అని ఆయన సూటి ప్రశ్నలు సంధించారు. ఆయన చేసిన కామెంట్స్ తప్పని తెలిసినప్పుడు యాంకర్లు వాకౌట్ చేసి ఉండాల్సిందని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
మగ యాంకర్ వినిపించలేదని, ఆ కో-యాంకర్ వచ్చి చెబితే చాలా బాధపడ్డానని స్టేట్మెంట్స్ ఇచ్చి తప్పించుకోలేరన్నారు. మనం ఎంజాయ్ చేసి... వివాదమయ్యాక ఎదుటోడిది తప్పు అనడం సరికాదన్నారు. మిగతా వాళ్లు చాలా ఆడియో ఫంక్షన్స్‌లో ఇంతకంటే ఘోరమైన కామెంట్స్ చేశారని, కానీ చలపతిరావు హానికరం కాదు... అందువల్ల మేం విరుచుకుపడతాం అన్న ధోరణి సరైంది కాదని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.