కోవిడ్ ప్రభావంతో దేశమంతటా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా థియేటర్స్ మూత పడ్డాయి. ఇటీవల థియేటర్స్‌ను యాబై శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవచ్చునని ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి. అయితే ఎగ్జిబిటర్స్ థియేటర్స్‌ను తెరవలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు చేసిన సహకారానికి ఎంటైర్ సినీ ఇండస్ట్రీ ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఈ సందర్భంగా.. మాజీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, నిర్మాత, ఎగ్జిబిటర్ ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌గారు సినిమా పరిశ్రమకు అండగా నిలబడుతూ ఈరోజు(శుక్రవారం) చేసిన సాయం ఎనలేనిది... వెలకట్టలేనిది. ఈ విషయంలో సహకరించిన సినిమా పెద్దలు మెగాస్టార్ చిరంజీవిగారికి, అక్కినేని నాగార్జునగారికి, ఆరోజు ఇండస్ట్రీ తరపున వెళ్లిన డైరెక్టర్స్ రాజమౌళిగారు, త్రివిక్రమ్‌గారు ఇతర సినీ పెద్దలు.. ఎవరెవరు అయితే వెళ్లి సీఎం జగన్‌గారిని కలిసి రిక్వెస్ట్ చేశారో వారందరికీ సినీ పరిశ్రమ ఎగ్జిబిటర్స్ తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఈరోజు ఎంఎస్ఎంఈ ప్యాకేజ్ కింద సినీ పరిశ్రమకు ఊరట కల్పించడం ఎంతో సంతోషించదగ్గ పరిణామం. పవర్ టారిఫ్ మూడు నెలలు కాకుండా లాక్‌డౌన్ వరకు కానీ చేసుండుంటే మాకు ఇంకా బావుండేది. అయినా ప్రభుత్వం అందించిన ఈ తోడ్పాటు మా ధన్యవాదాలు. థియేటర్స్ ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఉన్నవారికి ఇది ఊరటనిచ్చే అంశం. అంతేకాదు, ఎంతోమందికి ఉపాధి కల్పించే దారి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కోసం ఈరోజు వైజాగ్‌లో మా సినిమా షూటింగ్ జరుగుతుంటే... ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్‌లో మాకు పర్మిషన్స్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుండి ఎంతో తోడ్పాటుని అందిస్తుంది. సినిమా వాళ్లకి టాప్ ప్రియారిటీని అందించి రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేసుకోవడానికి మాకు సహాయ సహకారాలను అందిస్తున్నారు.
ఈ విషయంలో సినిమా పరిశ్రమకు అండగా నిలబడ్డ వై.ఎస్. జగన్ గారిని ప్రత్యేకంగా వెళ్లి కలుస్తాం. ఇంకా సినీ పరిశ్రమలో చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎంతోమందికి ప్రభుత్వం తరపున ఉదారంగా పథకాలను అందిస్తున్నారు. ఆ రకంగా సినిమా ఇండస్ట్రీలోని సమస్యలను పరిష్కరించగలిగే యండ్ అండ్ డైనమిక్ లీడర్ జగన్ పరిష్కరిస్తారని భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌తో పాటు వైజాగ్‌లోనూ అభివృద్ధి చెందుతుంది.
ఇండియా మరే సీఎం చేయలేని విధంగా మూడు నెలల పవర్ టారిఫ్ నుండి ఎగ్జంప్షన్ కల్పించారు జగన్‌గారు. మరో మూడు నెలలు కూడా ఎగ్జంప్షన్ ఇస్తారని మా ఎగ్జిబిటర్స్ తరపున కోరుకుంటున్నాం. జగన్‌గారు మంత్రిమండలిలో ఉంచి తీర్మానం చేయడమనేది ఎంటైర్ ఇండియాలోనే తొలిసారి కాబట్టి.. ఎంటైర్ ఇండియన్ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్‌కి గర్వ కారణంగా ఇది నిలిచిపోతుందని కోరుకుంటున్నాం. మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్‌గారికి, మంత్రిమండలికి, సినీ పెద్దలకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.