Ramcharan, birthday, celebrations
చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చిరు'త'నయుడిగా ఎంట్రీ ఇచ్చినా మొదటి సినిమాతోనే తనదైన హీరోయిజంతో ఆకట్టుకుని మెగా అభిమానులకు నిజంగా గొప్ప ఆనందాన్ని పంచారు చరణ్. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో రెండో సినిమాగా మగధీర సినిమాతో సినిమా రికార్డులను బద్దలు కొట్టి.. దేశవ్యాప్తంగా చరణ్ అంటే ఇది అనే రేంజ్ స్టామినా చాటాడు. రామ్ చరణ్ మగధీర సినిమా తరువాత అయన హీరోగా వెనక్కి చూసుకోవలసిన అవసరం రాలేదు.. ఆ తరువాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఏకంగా మూడు భారీ సినిమాల్లో నటిస్తుండడం ఈ పుట్టినరోజు విశేషం అని చెప్పాలి. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాలో చేస్తుండడం తో పాటు తండ్రి మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య లో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవం నేడు (శనివారం - 27) సందర్భంగా అయన జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా భారీ రికార్డు స్థాయిలో జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం సాయంత్రం హైద్రాబాద్ లో మెగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో మెగా హీరోలతో పాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మెగా అభిమానులు పాల్గొనడం విశేషం..ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, మైత్రి నిర్మాత నవీన్ యెర్నేని, స్వామి నాయుడు, యువ హీరో తేజ సజ్జ లతోపాటు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.