యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాథేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి పిరియాడిక్ లవ్ స్టోరీ.. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది అని వార్తలు వచ్చాయి.
నిర్మాణ సంస్థ కానీ, డైరెక్టర్ కానీ.. ఈ సినిమా కథ గురించి ఎప్పుడూ బయటపెట్టలేదు. జాతకం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపించింది. ఇలా వార్తలు వచ్చినప్పుడు కూడా... చిత్ర యూనిట్ స్పందించలేదు. దీంతో ఇది గాసిప్ ఏమో అనుకున్నారు. అయితే... ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌లో రాథేశ్యామ్ స్టోరీ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చారు.
జాతకం నేపథ్యంలో సాగే కథ ఇదని… ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ.. మోషన్ పోస్టర్‌లో అరచేయి, అందులోని గీతలతో టీజర్ స్టార్ట్ చేసారు. రోమియో జూలియట్, సలీమ్ అనార్కలీ, దేవదాసు పార్వతీ జంటల్ని కళ్ల ముందుకు తీసుకొచ్చి చివరి రాధే శ్యామ్‌లను చూపించారు.