మాఫియా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సాగే కథలో ఇంటెన్స్ డ్రామా, ఎమోషన్స్ తో నిండిన కథనాన్ని 'థగ్ లైఫ్' అందించబోతోంది. కమల్ హాసన్, విజనరీ డైరెక్టర్ మణిరత్నం మూడున్నర దశాబ్దాల తరువాత ఈ సినిమాతో మళ్లీ కలసి రావడం విశేషం. హీరో సింబు కీలక పాత్రలో కనిపించ నున్నాడు. ఈ పాత్ర కథకు బలాన్ని, డైనమిజాన్ని అందించనుంది. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, సాన్యా మల్హోత్రా, అశోక్ సెల్వన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.