తిరుమలలో ఉపాసన మౌనంగా వెళ్ళిపోయింది, ఎందుకో?

మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (18:54 IST)
రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున దర్సించుకున్నాడు. ఉపాసన ఒక్కరే తిరుమలకు వచ్చారు. కుటుంబ సభ్యులెవరూ ఆమె వెంట లేరు.
 
కుటుంబ సభ్యులతో దర్సనానికి ఎందుకు రాలేదంటూ మీడియా ప్రశ్నలు వేసినా ఆమె ఎంతమాత్రం స్పందించలేదు. ఆలయం బయటకు వచ్చిన ఉపాసన తల వంచుకుని వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 
 
మీడియాతో పాటు కొంతమంది అభిమానులు ఆమెను గమనించి మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఫోటోలు తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. త్వరలో కొణిదెల కుటుంబం మీడియా రంగంలోకి కూడా రాబోతోందట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు