కిరణ్ కుమార్ దర్శకత్వంలో వన్ విజన్ స్టూడియో పతాకంపై పర్వతనేని రాంబాబు నిర్మించిన లఘుచిత్రం 'వానర సైన్యం'. ఇందులో పర్వతనేని రాంబాబు, చోటు, చెర్రీ, నరేన్, కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన తారాగణం. శనివారం హైదరాబాద్‌లో ప్రసాద్ లాబ్స్‌లో ఈ షార్ట్ ఫిల్మ్ షో వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది మాట్లాడుతూ... "షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. అందరూ బాగా యాక్ట్ చేశారు. యుట్యూబ్‌లో ఈ ఫిల్మ్‌కు మంచి హిట్స్ రావాలి" అని అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్న కుమార్, ఎం.ఎస్.రెడ్డి, అనీల్ కృష్ణ తదితరులతో పాటు 'వానర సైన్యం' యూనిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.